Home  »  Bollywood News  »  ఓటీటీలోకి రష్మిక కొత్త మూవీ.. బెస్ట్ ఫ్రెండ్‌తో లవర్‌ని టెస్ట్ చేస్తే ఏమైంది.?

Updated : Aug 3, 2026

లవర్ ప్రేమని పరీక్షించడానికి బెస్ట్ ఫ్రెండ్‌ని అతనితో ఫ్లర్ట్ చేయమని చెప్తే? ఒకవేళ ఆ సరదా పరీక్షే ఒక పెద్ద ప్రమాదంగా మారి, ఆ బెస్ట్ ఫ్రెండ్ నిజంగానే లవర్‌తో ప్రేమలో పడిపోతే? ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'కాక్‌టెయిల్ 2'.

షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైపోయింది.

దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. రష్మిక, కృతి, షాహిద్‌ల మ్యాజికల్ కెమిస్ట్రీ, ఇటలీలోని అందమైన లొకేషన్లు, ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆగస్టు 14 నుంచి 'కాక్‌టెయిల్ 2' స్ట్రీమింగ్‌కు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది.

2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ఐకానిక్ 'కాక్‌టెయిల్' చిత్రానికి, ఈ సినిమాకు కేవలం టైటిల్ పరంగా మాత్రమే పోలిక ఉంది తప్ప.. ఇది దానికి సీక్వెల్ కాదు. ఇది పూర్తిగా ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కునాల్(షాహిద్ కపూర్), దియా(రష్మిక మందన్నా) చాలా కాలంగా లివిన్ రిలేషన్ లో ఉంటారు. అయితే, ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటూ వచ్చే ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని భావించి, ఇటలీలోని అందమైన సిసిలీ ప్రాంతానికి ఒక హాలిడే ట్రిప్‌కు వెళ్తారు.

అక్కడ దియా తన కాలేజ్ ఫ్రెండ్ అల్లీ (కృతి సనన్)ని కలుస్తుంది. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. తన లవర్ కునాల్ ప్రేమని టెస్ట్ చేయాలని భావించిన దియా, అల్లీని కునాల్‌తో కాస్త సరదాగా ఫ్లర్ట్ చేయమని అడుగుతుంది. కానీ, ఆ సరదా పరీక్ష అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అల్లీ నిజంగానే కునాల్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది మిగిలిన కథ.

 

 

Cocktail 2 OTT, Shahid Kapoor, Rashmika Mandanna, Kriti Sanon

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.